బుద్ధా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందన

  • కొడాలి నాని వర్సెస్ బుద్ధా వెంకన్న
  • కేసినో వ్యవహారంలో మాటల యుద్ధం
  • బుద్ధా వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలీసులపై లోకేశ్ విమర్శనాస్త్రాలు
బుద్ధా వెంకన్నను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "గుడివాడలో కొడాలి నాని కేసినో నడిపితే నో పోలీస్. అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్ష నేతని బూతులు తిడితే నో పోలీస్. చంద్రబాబు గారి ఇంటిపై దాడి చేస్తే నో పోలీస్. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్" అని మండిపడ్డారు.

కానీ, బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న నిలదీస్తే బిలబిలామంటూ వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారని విమర్శించారు. ఏపీ పోలీసులు ప్రజారక్షణకు ఉన్నారా? లేక నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుద్ధా వెంకన్న అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పనిచేస్తారని నిలదీశారు. వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే కేసినో నడుపుకోవచ్చని ఎద్దేవా చేశారు.

Nara Lokesh
Budda Venkanna
Arrest
Police
DGP
Kodali Nani
Casino
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News